Abn logo
May 18 2021 @ 00:14AM

కొత్త జేసీ బాధ్యతలు స్వీకరణ

 

నెల్లూరు, మే 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నూతన జాయింట్‌ కలెక్టర్‌గా (అభివృద్ధి) జీ గణేష్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌ చక్రధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పరిస్థితులు, అవసరాలను జేసీకు కలెక్టర్‌ వివరించారు. కాగా ఇప్పటివరకు జేసీగా ఉన్న ఎన్‌ ప్రభాకర్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో సెక్రటరీగా పనిచేస్తున్న గణేష్‌కుమార్‌ను నియమించింది.  

Advertisement