Abn logo
Sep 20 2020 @ 12:04PM

కొత్త జేమ్స్‌బాండ్‌ రానున్నాడా?

Kaakateeya

యాక్షన్‌ మూవీస్‌లో జేమ్స్‌ బాండ్ చిత్రాలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం జేమ్స్‌ బాండ్ సిరీస్‌లో 'నో టైమ్‌ టు డై' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్‌లో విడుదలకు సన్నద్ధమవుతుంది. డేనియల్‌ క్రెయిగ్‌ జేమ్స్‌ బాండ్ పాత్రలో నటిస్తున్నారు. కాగా.. ఈ సినిమా విడుదల తర్వాత చేయబోయే తదుపరి జేమ్స్‌ బాండ్ చిత్రాల్లో డేనియల్‌ క్రెయిగ్‌ బాండ్‌గా కనిపించబోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్రిటీష్‌ యాక్టర్‌ టామ్‌ హార్డీ తదుపరి బాండ్‌గా కనిపించబోతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనైతే రాలేదు. మరి ఈ సస్పెన్స్‌ ఎప్పుడు వీడుతుందో తెలియాలంటే వెయిటింగ్ తప్పదు. 


Advertisement
Advertisement
Advertisement