Abn logo
May 12 2020 @ 20:57PM

పవన్-హరీష్ సినిమాలో కొత్త హీరోయిన్?

ఎనిమిదేళ్ల క్రితం టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `గబ్బర్‌సింగ్` బ్యాచ్ మరోసారి కలవబోతోంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో నటించబోయే కథానాయిక గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన ఓ కొత్త హీరోయిన్ కనిపించబోతోందట.


మలయాళ భామ మానసా రాధాకృష్ణన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. అందంగా, క్యూట్‌గా ఉండే మానస ఇప్పటివరకు సాంప్రదాయ పాత్రల్లోనే నటించింది. పవన్ సినిమాలో మానస నటిస్తోందని వార్త రాగానే ఆమె గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్ ఫ్యాన్స్ ఆమె గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement