ఇంటి పని చేసే కార్మికుల కోసం మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-04-14T18:13:12+05:30 IST

కరోనా కోసం లాక్ డౌన్, కర్ఫ్యూ సరే.. ఇంట్లో ఉండాలన్నా తమ కష్టం ఎలా తీరుతుందంటూ..

ఇంటి పని చేసే కార్మికుల కోసం మార్గదర్శకాలు

ముంబై: కరోనా కోసం లాక్ డౌన్, కర్ఫ్యూ సరే.. ఇంట్లో ఉండాలన్నా తమ కష్టం ఎలా తీరుతుందంటూ ఎక్కువ మంది ముంబై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో ఎక్కువమంది ఇళ్లల్లో పనిమనిషి లేనిదే ఇంటి పనులు నడవవు. ఇప్పుడు కర్ఫ్యూ ఆంక్షలతో పనికి రాకపోతే.. ఆఫీసు పని కూడా ఇంట్లో చేస్తూ.. ఇంటి పని కూడా చేసుకోవాలంటే కష్టమవుతోందని అంటున్నారు. అందుకే దీనికొక మార్గం చూడాలంటూ ముంబై మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్లు చేస్తున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఓ సర్వే ప్రకారం 2016లో ముంబైకి చాలా మంది మహిళలు వలస వచ్చారు. 18 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే ఉన్నారు. వారిలో దాదాపు 55 శాతం మంది పనిమనుషులుగా ఉన్నారు. ఇంతమంది ముంబైలో ఉన్నారంటే.. లాక్ డౌన్‌తో వారంతా పనికి వెళ్లకపోతే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యపై  బీఎంసీ కమిషనర్ దృష్టి పెట్టారు. ఇంటి పనులు చేసే కార్మికుల వరకు పనికి హాజరయ్యేలా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీని కోసం గైడ్ లైన్స్ రూపొందిస్తున్నామని కమిషనర్ వివరించారు.

Updated Date - 2021-04-14T18:13:12+05:30 IST