కొత్త గేమ్స్‌

ABN , First Publish Date - 2020-04-02T06:00:28+05:30 IST

లాక్‌డౌన్‌ మూలంగా దేశం మొత్తం స్తంభించింది. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. కొందరు ఇష్టమైన పనులతో కాలక్షేపం చేస్తుంటే,

కొత్త గేమ్స్‌

లాక్‌డౌన్‌ మూలంగా దేశం మొత్తం స్తంభించింది. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. కొందరు ఇష్టమైన పనులతో కాలక్షేపం చేస్తుంటే, మరికొందరు స్మార్ట్‌ఫోన్లతో గడిపేస్తున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో నివసించే వారు ఛాటింగ్‌ యాప్స్‌లో సరికొత్త ఆటలు ఆడుతూ బిజీగా ఉంటున్నారు.

  1. అపార్టుమెంట్లలో, గేటెడ్‌ కమ్యూనిటీలలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఏ ఇద్దరు ఒకచోట చేరకుండా చూస్తున్నారు. అందుకే వాళ్లు సామాజిక దూరం పాటిస్తూనే ఆటలు ఆడుకునేందుకు సోషల్‌ మీడియాను ఎంచుకుంటున్నారు. 
  2. కొన్ని అపార్ట్‌మెంట్లలో ‘సింగ్‌ ఎ సాంగ్‌’ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌లో ఒక గేమ్‌ను క్రియేట్‌ చేశారు. ఇందులో నిర్ణీత సమయంలో ఎవరైతే ఎక్కువ పాటలు పాడతారో వారిని విన్నర్‌గా ప్రకటిస్తారు.
  3. అలాగే ‘అంత్యాక్షరి’ పేరుతో మరో గేమ్‌ను వాట్సప్‌లో రూపొందించారు. ఇందులో పాల్గొనే వారు పాట పాడి అప్‌లోడ్‌ చేయాలి. క్లాసికల్‌ సాంగ్స్‌, పాత పాటలు ఏవైనా ఎంచుకోవచ్చు. ఒకరి తరువాత మరొకరు పాటలు పాడుతూ అప్‌లోడ్‌ చేస్తుండాలి.
  4. ‘రైట్‌ ఎ స్టోరీ’ పేరుతో మరో గేమ్‌ కూడా పెట్టారు. ఈ థీమ్‌లో ఏదైనా ఒక స్టోరీ రాసి పోస్ట్‌ చేయాల్సి ఉంఉంటుంది. అలా అందరూ రాసిన స్టోరీలను కలిపి లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఈ-బుక్‌ రూపంలో తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు. 
  5. ‘కిస్‌, మ్యారీ ఆర్‌ కిల్‌’ పేరుతో మరో గేమ్‌ను రూపొందించారు. ఇందులో ఒక సెలబ్రిటీని ఎంచుకోవాలి. మిగతా సభ్యులు ఆ సెలబ్రిటీని కిస్‌ చేస్తావా? పెళ్లి చేసుకుంటావా? లేక చంపేస్తావా? అని అడుగుతారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే ఇలాంటి ఆటలు ఆడడానికి చాలామంది అపార్ట్‌మెంట్‌ వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీవాసులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలా తమకు తాము బిజీగా ఉండేలా చూసుకుంటున్నారు.

Updated Date - 2020-04-02T06:00:28+05:30 IST