భారత జట్టుకు యో-యో 2.0..?

ABN , First Publish Date - 2021-01-23T17:20:13+05:30 IST

టీమిండియా ఆటగాళ్లకు కొత్త ఫిట్‌నెస్ టెస్ట్‌ను తీసుకొచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ కొత్త టెస్ట్ ఇప్పటికే ఉన్న యోయో టెస్ట్‌కు అదనంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ టెస్టులో ఆటగాళ్లు అదనంగా 2 కిలోమీటర్ల దూరాన్ని..

భారత జట్టుకు యో-యో 2.0..?

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఆటగాళ్లకు కొత్త ఫిట్‌నెస్ టెస్ట్‌ను తీసుకొచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ కొత్త టెస్ట్ ఇప్పటికే ఉన్న యోయో టెస్ట్‌కు అదనంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ టెస్టులో ఆటగాళ్లు అదనంగా 2 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లయితే ఈ దూరాన్ని 8 నిముషాల 15 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ 8 నిముషాల 30 సెకండ్‌లలో ఈ దూరాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టెస్ట్ యో-యో టెస్టుకు ప్రత్యామ్నాయం కాదని, అదనమని బీసీసీఐ తెలిపింది. యో-యో టెస్టు పూర్తి చేసిన ఆటగాళ్లు ఇక నుంచి ఈ టెస్టును కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. 


ఇప్పటికే యో-యో టెస్టు వల్ల భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, ప్రపంచ క్రికెటర్లలో మేటి ఆటగాళ్లుగా తయారయ్యారని, మైదానంలో వారి ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని బీసీసీఐ పేర్కొంది. అయితే తాజాగా ప్రవేశపెట్టిన కొత్త టెస్టుతో వారి ఫిట్‌నెస్ మరింత పెరుగుతుందని, మైదానంలో చిరుతల్లా కదులుతారని బీసీసీఐ ధీమా వ్యక్తం చేస్తోంది.


Updated Date - 2021-01-23T17:20:13+05:30 IST