మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు

ABN , First Publish Date - 2021-05-15T05:35:08+05:30 IST

సోషల్‌ మీడియాలో కీలకంగా ఉన్న ఫేస్‌బుక్‌ - మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ‘మరింత మెరుగ్గా తమ భావాలను వ్యక్తం చేసేందుకు, కావాల్సింది గుర్తించేందుకు, తమతోనే ఎప్పటికీ ఉండేందుకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నా’మని

మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు

సోషల్‌ మీడియాలో కీలకంగా ఉన్న ఫేస్‌బుక్‌ - మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ‘మరింత మెరుగ్గా తమ భావాలను వ్యక్తం చేసేందుకు, కావాల్సింది గుర్తించేందుకు, తమతోనే ఎప్పటికీ ఉండేందుకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నా’మని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. మెసెంజర్‌లో ఆర్కైవ్స్‌ను దానికి తోడుగా మొబైల్‌లో ఆర్కైవ్డ్‌ చాట్స్‌ ఫోల్డర్‌ను ఉంచింది. వినియోగదారులు తమ ప్రొఫైల్‌ పిక్చర్‌ను టాప్‌ చేసి,  ఆర్కైవ్డ్‌ చాట్స్‌ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రెంటిలోనూ రెండు చాట్‌ థీమ్స్‌ను తీసుకొచ్చింది. ‘స్టార్‌ వార్స్‌ సెలీనా: ద సిరీస్‌ ఉంచింది. న్యూ కెమెరా స్టిక్కర్లను మెసెంజర్‌కు అదనంగా జోడించింది. ఆసియా, పసిఫిక్‌లో నివసించే వారికి భిన్నత్వం, సానుకూల ప్రభావం చూపేందుకు వాటిని పరిచయం చేసింది. మెసెంజర్‌లో ఆడియో రికార్డింగ్‌ చేసుకునే సదుపాయం కలుగజేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు ‘ఇన్‌ బాక్స్‌ సీన్‌ స్టాటస్‌’ ఫీచర్‌ సహాయంతో తమ మెసేజ్‌లను స్నేహితులు చూశారా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే మెసేజ్‌ అందుకోవాల్సిన వ్యక్తి చూసిందీ, లేనిదీ కూడా తెలుసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ డిఎంలలో విజువల్‌ సమాధానాన్ని పంపుకొనే వెసులుబాటును కల్పిస్తోంది. ఐఓఎస్‌ వినియోగదారులు మరో ఫొటో లేదా వీడియోతో జతచేయవచ్చు. ఆండ్రాయిడ్‌ వినియోగదారులకూ ఈ సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది.

Updated Date - 2021-05-15T05:35:08+05:30 IST