గూగుల్‌ ఫోటోస్‌కు కొత్త హంగులు!

ABN , First Publish Date - 2021-02-20T06:21:36+05:30 IST

‘గూగుల్‌ ఫొటోస్‌’లో సరికొత్త ఫీచర్‌ విడుదలవుతోంది. యాప్‌లో వీడియో వీక్షణను మరింత మెరుగు పరిచేందుకు గూగుల్‌ దీన్ని విడుదల చేస్తోంది. ‘ఆండ్రాయిడ్‌ పోలీస్‌’ సమాచారం ప్రకారం ఇప్పటికే కొందరు వినియోగదారులకు టెస్టింగ్‌ బేస్‌లో ఈ ఫీచర్‌ను

గూగుల్‌ ఫోటోస్‌కు కొత్త హంగులు!

‘గూగుల్‌ ఫొటోస్‌’లో సరికొత్త ఫీచర్‌ విడుదలవుతోంది. యాప్‌లో వీడియో వీక్షణను మరింత మెరుగు పరిచేందుకు గూగుల్‌ దీన్ని విడుదల చేస్తోంది. ‘ఆండ్రాయిడ్‌ పోలీస్‌’ సమాచారం ప్రకారం ఇప్పటికే కొందరు వినియోగదారులకు టెస్టింగ్‌ బేస్‌లో ఈ ఫీచర్‌ను అందిస్తోంది. ఫొటోలను పెద్దగా చేసుకోవడంతోపాటు, మొత్తం వీడియోను పాన్‌చేసుకోవచ్చు. 


యాప్‌తో వీడియో లేదా ఫొటోను పెద్దగా చూసేందుకు దానిపైన డబుల్‌ టాప్‌ చేయాలి. రెండో సారి డబుల్‌ టాప్‌తో జూమ్‌ అయిన  వీడియోను వెనక్కు తేవచ్చు. అలాగే ప్రత్యేకించి వీడియో లేదా ఫొటోలోని ఒక ఫ్రేమ్‌పై కూడా ఫోకస్‌ చేసి జూమ్‌ చేసి అక్కడి వరకే చూడవచ్చు. అయితే ఈ యాప్‌ వెర్షన్‌ను ఎక్కడ విడుదల చేసిందన్న సమాచారం మాత్రం తెలియజేయలేదు. 


నిజానికి గుగుల్‌ తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఫీచర్లకు తరచుగా ఎన్నో అదనపు హంగులను సమకూరుస్తోంది. గత డిసెంబర్‌లో మ్యాప్స్‌కు టైమ్‌లైన్‌ను చేర్చింది. ఆ ఫొటోపై క్లిక్‌ చేస్తే అది ఎప్పుడు, ఎక్కడ తీసిందన్నది తెలుస్తుంది. వినియోగదారులు చేయాల్సింది ఒక్కటే, మ్యాప్‌పై సెర్చ్‌ ట్యాబ్‌తో ప్రవేశించవచ్చు. మొత్తమ్మీద ఫొటోలు ఎక్కడ, ఎన్నడు తీసుకున్నది దీనితో తెలుస్తుంది.  క్లిక్‌ చేసిన ఫొటోలను జిపిఎస్‌ ఆధారంగా లొకేషన్‌ను గుర్తించి ల్యాండ్‌ మార్కులను డిటెక్ట్‌ చేస్తుంది.

Read more