ఆండ్రాయిడ్‌ ఫోన్లకు కొత్త ఫీచర్లు

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం ఆండ్రాయిడ్‌ ఏకంగా ఏడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త టూల్స్‌, విధానాలతో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు మరిన్ని కొత్త అనుభవాలను ఆస్వాదించవచ్చు.

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు కొత్త ఫీచర్లు

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం ఆండ్రాయిడ్‌ ఏకంగా ఏడు కొత్త  ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త టూల్స్‌, విధానాలతో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు మరిన్ని కొత్త అనుభవాలను ఆస్వాదించవచ్చు. 


ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్ర్కిప్షన్‌

మెసేజ్‌ యాప్‌ నుంచి పంపే ఆర్‌సీఎస్‌ చాట్స్‌ ఇకపై ఎండ్‌ టు ఎన్‌స్ర్కిప్షన్‌ కలిగి ఉంటాయి. గత ఏడాది నవంబరులోనే బేటాలో రిలీజ్‌ చేసిన ఈ ఫీచర్‌ను గూగుల్‌ ఇప్పుడు వినియోగదారులకు విడుదల చేసింది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్ర్కిప్షన్‌ ఫలితంగా ఇకపై పంపే మెసేజ్‌లు మరింత భద్రంగా ఉంటాయి. ఒక ఫోన్‌ నుంచి మరొక ఫోన్‌కు పంపే మెసేజ్‌లను మరెవ్వరూ చదివే అవకాశమే ఉండదు. 


భూకంపాల అలెర్ట్‌

ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌(భూకంపాలు) అలెర్ట్‌ సిస్టమ్‌ను న్యూజీలాండ్‌, ఇటలీ దేశాల్లో ఇప్పటికే ఆరంభించింది. ప్రస్తుతం  ఆ సదుపాయాన్ని టర్కీ, ఫిలిప్పీన్స్‌, కజికిస్థాన్‌, కిర్జ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, తుర్కుమెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాలకు విస్తరించింది. ఉచితంగా లభించే ఈ సదుపాయంతో అక్కడి ప్రజలు ముందస్తుగా భూకంపాలు సంభవించడాన్ని తెలుసుకోగలుగుతారు. అండ్రాయిడ్‌ ఫోన్లతో ఈ ముందస్తు హెచ్చరికల నెట్‌వర్క్‌ను గూగుల్‌ సమకూరుస్తోంది. 


స్టేర్డ్‌ మెసేజెస్‌ ఫీచర్‌

వాట్సాప్‌ మాదిరిగానే ఆండ్రాయిడ్‌ వినియోగదారులు కూడా తమ మెసేజింగ్‌ యాప్‌లో మెసేజ్‌లకు స్టార్‌ను పెట్టుకోవచ్చు. తద్వారా అన్నింటినీ స్ర్కోల్‌ చేయకుండానే ముఖ్యమైన మెసేజ్‌లను గుర్తించవచ్చు. ఇందుకో కోసం టాప్‌ - హోల్డ్‌ చేసి స్టార్‌ పెట్టుకోవచ్చు. 


ఆండ్రాయిడ్‌ ఆటోకు కొత్త ఆప్షన్స్‌

ఆండ్రాయిడ్‌ ఆటో ఎక్స్‌పీరియన్స్‌ అనుభవం అంటే ఫోన్‌లోనే మాన్యువల్‌ డార్క్‌ మోడ్‌ సెట్‌ చేసుకుని లాంచర్‌ స్ర్కీన్‌ను పర్సనలైజ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మీడియా యాప్‌లో కొత్త టాబ్స్‌ - ‘బ్యాక్‌ టు టాప్‌’ ఆప్షన్‌, స్ర్కోల్‌ బార్‌పై ఎ టు జెడ్‌ ఆప్షన్‌ ఉన్నాయి. 


ఎమోజీలు

ఎమోజీ కిచెన్‌ రూపకల్పన చేసిన స్టిక్కర్లను జిబోర్డ్‌ యాప్‌ త్వరలోనే ఆరంభించనుంది. రెండు వేర్వేరు ఎమోజీలను మెషప్‌(కలపడం) చేసేందుకు గూగుల్‌ టూల్‌ ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్‌, స్పానిష్‌, పోర్చుగీసులో రాసినప్పుడు దానికి కరెక్ట్‌గా సరిపోయే ఎమోజీని సమయానుకూలంగా వెంటనే గూగుల్‌ టూల్‌ సజెస్ట్‌ చేస్తుంది. 


జస్ట్‌ వాయిస్‌తో

కేవలం వాయిస్‌తో కావాలనుకున్న యాప్స్‌ కోసం సెర్చ్‌  లేదా ఓపెన్‌ చేయవచ్చు. ‘హే గూగుల్‌, పే మై ఎలక్ట్రిసిటీ బిల్‌’ అని చెప్పి చేయించుకోవచ్చు. యాప్‌లోకి వెళ్ళి సదరు టాస్క్‌ను పూర్తి చేయవచ్చు. 


సులువుగా యాక్సెస్‌, నేవిగేషన్‌

ముఖ్యంగా ఒక చోట నుంచి కదలలేని వ్యక్తులు మాటతోనే చాలా వేగంగా యాక్సెస్‌, నేవిగేషన్‌ సదుపాయలను పొందవచ్చు. స్ర్కీన్‌పై చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే వాయిస్‌ యాక్సెస్‌తో పనులు చేయించుకోవచ్చు. ప్రెండ్స్‌తో మాట్లాడుతూనే మరోపక్క ఫోన్‌ వినియోగించుకోవచ్చు. ఇంప్రూవ్డ్‌ పాస్‌వర్డ్‌ ఇన్‌పుట్‌తో వాయిస్‌ యాక్సెస్‌ వస్తోంది. పాస్‌వర్డ్‌ ఫీల్డ్‌ను అది గుర్తించగానే, ఇన్‌పుట్‌ లెటర్స్‌, నంబర్లు, సింబల్స్‌తో పనిచేసుకోవచ్చు.

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST