Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆండ్రాయిడ్‌ 13లో ‘ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌’!

  • న్యూ ఫీచర్‌


గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 13లో కొత్త ఫీచర్‌ ఉంచుతోందని సమాచారం. మీడియా కోసం ‘టాప్‌-టు-ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌’ని జోడిస్తోందని భోగట్టా. ఈ కొత్త ఫీచర్‌తో వ్యక్తులు తమ ఫోన్‌ నుంచి సమీపంలోని స్పీకర్‌ లేదంటే డివైస్‌కు మీడియా బదిలీ చేయవచ్చు. ఫోన్‌ టాప్‌లో చిప్‌ నోటిఫికేషన్‌గా కనిపిస్తుంది. అలాగే ‘అన్‌డు’ బటన్‌ ఉంటుంది. తప్పు దొర్లితే ఆ బటన్‌ సహాయంతో ఫైల్‌ను వెనక్కు తెప్పించుకోవచ్చు. ఐఫోన్స్‌, హోమ్‌ పాడ్స్‌లో ఇప్పుడు ఉన్న వాటి మాదిరిగానే ఇది ఆండ్రాయిడ్‌ 13లో పనిచేస్తుంది. యాపిల్‌ ఫోన్లలో యుఐ చిప్‌తో పనిచేస్తుంది. పిక్సల్‌ 6ప్రొ అలాగే శాంసంగ్‌ తదుపరి ఫోన్లలో కూడా ఇది లభ్యమవుతుంది. ఈ ఫీచర్‌ కోసం ఎన్‌ఎఫ్‌సిని గూగుల్‌ ఉపయోగించవచ్చని సమాచారం. 


Advertisement
Advertisement