కొత్త రైతు బజార్లు

ABN , First Publish Date - 2020-06-07T05:54:49+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా పట్టణాల్లో కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నారు.

కొత్త రైతు బజార్లు

 మార్కెటింగ్‌ శాఖ ప్రణాళిక

 ప్రతి పట్టణంలో స్థలాలు చూపాలంటూ ప్రతిపాదన

 శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు కసరత్తు

10  సెంట్లు స్థలం ఇస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు 


 (తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి)

 కరోనా నియంత్రణలో భాగంగా పట్టణాల్లో కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థల ప్రాంగణాల్లో వాటిని  నిర్వహిస్తున్నారు. ఆగ స్టులో విద్యా సంస్థలు తెరచుకోనున్నాయి. అదే ప్రాంగణంలో రైతు బజార్లు నిర్వ హించడం సాధ్యమయ్యే పనికాదు. ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ రైతు బజార్లు నెలకొ ల్పారు. వీటిని మరో చోటుకు  తరలించే పనిలో మార్కెటింగ్‌ శాఖ నిమగ్నమైంది. జిల్లాలోని ప్రతి మునిసిపాలిటీలో 5 సెంట్ల విస్తీర్ణంలో తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు, కనీసం మూడు చోట్ల స్థలం చూపిం చాలని ప్రతి మునిసిపాలిటీకి  ప్రతిపాదించారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో సహా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడద వోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల్లో తాత్కాలిక రైతు బజార్లు ఉన్నాయి. వీటిని మరింతగా విస్తరించాలని సంకల్పించారు. ప్రతి పట్టణంలో మరో 3 రైతు బజార్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.


ప్రస్తుతం నెలకొల్పిన తాత్కాలిక రైతు బజార్లు పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సమీప పల్లెల నుంచి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే రద్దీ ఉంటోంది. దీనిని అధిగమించేందుకు తాత్కాలిక రైతు బజార్లను విస్తరించాలని మార్కెటింగ్‌ శాఖకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పట్టణాల్లో స్థలాలు చూపించాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన కూడా  రైతు బజార్లు ఏర్పాటు చేయ డానికి 10 సెంట్లు స్థలం చూపాలని మునిసిపాలిటీలకు మార్కెటింగ్‌ శాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే జిల్లాలో 5 పట్టణాల్లో శాశ్వత రైతు బజార్లు నడు స్తున్నాయి. తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంలో కొత్త వాటిని నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. స్థలాలు కేటాయించారు. టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇవి పూర్తయినా సరే రద్దీ తప్పదు. పట్టణ ప్రజలకు మరింతగా కూరగాయలు అందుబాటులోకి తేవాలంటే ప్రతి పట్టణంలో మరో శాశ్వత బజార్‌ను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌ శాఖ సంకల్పించింది. మార్కెటింగ్‌ శాఖ వద్ద నిధులు కూడా పుష్కలంగా ఉన్నాయి. మునిసిపాలిటీలు స్థలం చూపిస్తే శాశ్వత రైతు బజార్లు సైతం విస్తరించే అవకాఽశం ఉంది. 

Updated Date - 2020-06-07T05:54:49+05:30 IST