అనకాపల్లి వద్దు.. విశాఖ ముద్దు..

ABN , First Publish Date - 2022-02-01T02:17:25+05:30 IST

అనకాపల్లి వద్దు, విశాఖ ముద్దు అంటూ అఖిలపక్షం

అనకాపల్లి వద్దు.. విశాఖ ముద్దు..

విశాఖ: అనకాపల్లి వద్దు, విశాఖ ముద్దు అంటూ అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ, అఖిలపక్షం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి బండారు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే ఉంచాలన్నారు. దీనికోసం శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. వచ్చేనెల 6,7,8,తారీఖున నియోజకవర్గంలో అన్ని పార్టీల అతీతంగా  ప్రజల నుంచి సంతకాల సేకరణ జరుపాలని నిర్ణయించారు. 9న జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేయాలని సమావేశంలో తీర్మానించారు. 


Updated Date - 2022-02-01T02:17:25+05:30 IST