కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటుపై వైసీపీ నేతల మధ్య అభిప్రాయభేదాలు

ABN , First Publish Date - 2022-01-31T20:23:44+05:30 IST

అధికార పార్టీలో జిల్లా పునర్విభజన మంటలు చెలరేగుతున్నాయి. ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటుపై వైసీపీ నేతల మధ్య అభిప్రాయభేదాలు

ఏలూరు: అధికార పార్టీలో జిల్లా పునర్విభజన మంటలు చెలరేగుతున్నాయి. ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అర్ధరాత్రి హడావు డిగా జారీ చేసిన కొత్త జిల్లాల ప్రకటనతో జనం మధ్య అభిప్రాయాల చిచ్చు రేగుతోంది. వీటిని కప్పిపుచ్చుతూ ఎమ్మెల్యేల సారథ్యంలో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు జరుగుతున్నా యి. జిల్లా కేంద్రంపై నరసాపురం–భీమవరం మధ్య మాటలు.. సెగలు, పొగలు కక్కుతున్నా యి. ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారుస్తుంటే ఆ కోవలోనే రాజకీయం వేడుక్కెతోంది.


కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటుపై వైసీపీ నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే ప్రసాదరాజు డిమాండ్ చేస్తున్నారు. భీమవరంను జిల్లా కేంద్రంగా ఉంచాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్‌ను విడివిడిగా కలిసి ఇద్దరు ఎమ్మెల్యేలు వినతిపత్రాలు ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను కలవడంపై వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 


నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పాటైంది. దీని కేంద్రంగా భీమవరాన్ని ఎంపిక చేయడంతో ప్రాంతాల మధ్య, నియోజకవర్గాల మధ్య చిచ్చు రేపింది. పాత అనుభవాలను తవ్వి తీస్తూ కొందరు, పునర్విభజనతో నష్టాన్ని అంచనా వేస్తూ ఇంకొందరు వీధులకెక్కుతున్నారు. అధికార పార్టీలో ఈ వ్యవహారం సయోధ్యను చెరి పేసి భేదాన్ని పెంచింది. భీమవరం జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతి రేకిస్తూ నరసాపురం వాసులు నిరసనలకు దిగుతున్నారు. అఖిలపక్షం పేరిట అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు.

Updated Date - 2022-01-31T20:23:44+05:30 IST