న్యూఢిల్లీ: నగరంలోని తెలంగాణ భవన్లో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సైబర్ క్రైమ్ కేసులో అరెస్టయిన నిందితుడు తెలంగాణ భవన్ 4వ అంతస్తు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. రూమ్ నెంబర్ 401లో ఉన్న నిందితుడు. పైపులు పట్టుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పట్టు జారి కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే చెట్టు మీదుగా జారిపడడంతో ప్రాణాపాయం తప్పింది. నిందితుడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అది మొరాయించింది. ఎంతకీ స్టార్ కాకపోవడంతో పోలీసులు నిందితుడిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు.