న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెండింగ్ సమస్యలపై కేంద్రంతో ఏపీ ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల ప్రధానిని సీఎం జగన్ కలిసారు. దీంతో సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర కార్యదర్శుల బృందంతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సమావేశమై చర్చలు జరుపుతోంది. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రతినిధి బృందం కోరనుంది. రెవెన్యూ లోటు కింద ఏపీకి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, అలాగే విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలన్నింటికీ.. నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రతినిధి బృందం కేంద్రానికి వినతి చేయనుంది.