ట్రిపుల్‌ ఐటీలో కొత్త కోర్సులు

ABN , First Publish Date - 2020-08-10T09:16:18+05:30 IST

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం)లో ఈ ఏడాది కొత్తగా మూడు ఎంటెక్‌ కోర్సులు ప్రారంభమౌతున్నాయి.

ట్రిపుల్‌ ఐటీలో కొత్త కోర్సులు

ట్రిపుల్‌ ఐటీలో కొత్త కోర్సులు

నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

మొదటి బ్యాచ్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

 

కర్నూలు(ఎడ్యుకేషన్‌) ఆగస్టు 9: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ  డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం)లో ఈ ఏడాది కొత్తగా మూడు ఎంటెక్‌ కోర్సులు ప్రారంభమౌతున్నాయి. 2020-2021 విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్‌ డేటా అనలిటిక్స్‌, ఎలక్ర్టానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌ కోర్సు, స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ట్రిపుల్‌ఐటీడీఎం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఫ్యాకల్టీకి ఏడో బ్యాచ్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ కూడా ప్రారంభం కానుంది. 


43 మందికి ఉద్యోగాలు

కర్నూలు ట్రిపుల్‌ఐటీడీఎంలో మొదటి బ్యాచ్‌ విద్యార్థులు 43 మంది ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఒకరికి ఆమేజాన్‌ కంపెనీ రూ.28 లక్షల ప్యాకేజీ ఇవ్వటం విశేషం. 2వ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు 4 నెలల ఇంటర్న్‌షిప్‌ కోర్సు పూర్తి చేసుకుని ప్లేస్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 


ఉన్నతంగా తీర్చిదిద్దుతాం.. ప్రొఫెసర్‌ డీవీఎల్‌ఎన్‌ సోమయాజులు, ట్రిపుల్‌ ఐటీడీఎం డైరెక్టర్‌

కర్నూలు ఐఐఐటీడీఎంను రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు-నంద్యాల జాతీయ రహదారి నుంచి జగన్నాథగట్టు వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డు విస్తరణ పనులు, రోడ్డు వెంట లైటింగ్‌, మున్సిపల్‌ వాటర్‌ సరఫరా వంటి పనులకు నిధుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.  ఇప్పటికే ఫ్యాకల్టీకి ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తున్నాం. వర్చువల్‌ లెర్నింగ్‌ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం. 

Updated Date - 2020-08-10T09:16:18+05:30 IST