మరో కొత్త కరోనా వేరియంట్.. యూకేలో 16 కేసులు!

ABN , First Publish Date - 2021-07-27T07:58:59+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా గురించి మరో ఆందోళనకర విషయం వెలుగు చూసింది.

మరో కొత్త కరోనా వేరియంట్.. యూకేలో 16 కేసులు!

లండన్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా గురించి మరో ఆందోళనకర విషయం వెలుగు చూసింది. ఇప్పటికే ఈ వైరస్‌కు సంబంధించిన పలు వేరియంట్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా డెల్టా వేరియంట్ ప్రస్తుతం అమెరికా, యూరోపియన్ దేశాలు, భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో అధికంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్‌ మరో వేరియంట్ వెలుగు చూసిందని పరిశోధకులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్ యూకేలో బయటపడింది. ఇప్పటి వరకూ ఈ వేరియంట్ 16 కేసుల్లో కనిపించినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్టండ్ (పీహెచ్‌ఈ) వెల్లడించింది. దీన్ని వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ (పరిశీలనలో ఉన్న వేరియంట్)గా యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ వేరియంట్‌ను బి.1.621గా సైంటిస్టులు పిలుస్తున్నారు. కొలంబియాలో జనవరి నెలలో ఈ వేరియంట్ వెలుగు చూసినట్లు సమాచారం. అయితే ఈ వేరియంట్ వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందడం లేదంటే వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం వంటి లక్షణాలేవీ కనిపించిన ఆనవాళ్లు లేవని పీహెచ్‌ఈ వివరించింది.

Updated Date - 2021-07-27T07:58:59+05:30 IST