తినండి... వెరైటీగా

ABN , First Publish Date - 2022-08-06T05:52:13+05:30 IST

చేసిన వంటలే చేస్తుంటే ఎవరికైనా మొహం మొత్తేస్తుంది. రోజుకొక కొత్తరకం వంట తింటే ఆ మజానే వేరు. ఈ వర్షాకాలంలో ఆ వేడి వేడి వంటల రుచి చూద్దాం..

తినండి... వెరైటీగా

చేసిన వంటలే చేస్తుంటే ఎవరికైనా మొహం మొత్తేస్తుంది. రోజుకొక కొత్తరకం వంట తింటే ఆ మజానే వేరు. ఈ వర్షాకాలంలో ఆ వేడి వేడి వంటల రుచి చూద్దాం..


సోయా హలీమ్‌

కావాల్సిన పదార్థాలు

గోధుమ రవ్వ- 250 గ్రాములు (రాత్రంతా నానబెట్టాలి), సోయా గ్రానుల్స్‌-250 గ్రాములు(రాత్రంతా నానబెట్టాలి), అల్లం,వెల్లుల్లి పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయలు- టేబుల్‌ స్పూన్‌, కారంపొడి- టేబుల్‌ స్పూన్‌, పెరుగు- అరకప్పు, పసుపు- అరటీస్పూన్‌, గరం మసాలా పొడి- టీస్పూన్‌, నెయ్యి- అరకప్పు, నూనె- 2టేబుల్‌ స్పూన్లు, ఉప్పు-రుచికి తగినంత, కొత్తిమీర, పుదీనా ఆకులు- సగం కప్పు

గార్నిష్‌ కోసం: వేయించిన ఉల్లిపాయలు, తాజా కొత్తిమీర ఆకులు, నిమ్మకాయ ముక్కలు, వేయించిన జీడిపప్పు పలుకులు, నెయ్యి




బూందీ మేతీ కర్రీ

కావాల్సిన పదార్థాలు

బూందీ- 150 గ్రాములు, ఉల్లిపాయలు-1 (సన్నగా తరగాలి), పెరుగు-200 గ్రాములు, అల్లం,వెల్లులి పేస్ట్‌- టేబుల్‌ స్పూన్‌, కారంపొడి- పావు టీస్పూన్‌, పసుపు- అరటీస్పూన్‌, మెంతి ఆకులు- అరకప్పు, నూనె-అరకప్పు, ఉప్పు- రుచికి తగినంత, కొత్తిమీర ఆకులు, నిమ్మరసం గార్నిష్‌ కోసం ఉంచుకోవాలి.


తయారీ విధానం

ప్యాన్‌పై నూనె వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. మంట తగ్గించి అల్లం, వెల్లులి పేస్టు వేయాలి. కారంపొడి, పసుపు, మెంతి ఆకులు, తగినంత ఉప్పు వేయాలి. కొద్దిగా నీళ్లు కలపాలి. గరిటెతో కదిలిస్తుండాలి. కొద్ది సేపటి తర్వాత పెరుగు వేసి మూడు నిమిషాలపాటు మూతను పెట్టి ఉంచాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి ప్యాన్‌లో మిశ్రమం సగం అయ్యేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత మంటను తగ్గించి.. బూందీ వేయాలి. ప్యాన్‌కి మూతపెట్టాలి. మూడు నిమిషాల తర్వాత మూతను తీసేసి ఆ మిశ్రమానికి కొత్తిమీర ఆకులు, నిమ్మరసంతో గార్నిష్‌ చేయాలి. వేడి అన్నంతో తినాలి.



క్యాప్సికమ్‌ పకోడి

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికమ్‌- 6 (లోపలి భాగం తీసేయాలి), శనగపిండి- 6 టేబుల్‌ స్పూన్లు, కారం- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయలు- ఒకటి (సన్నగా తరగాలి), పసుపు- టీస్పూన్‌లో సగం, కొత్తిమీర- సగం కప్పు, పచ్చి మిరపకాయలు-2, నూనె- అరకప్పు, జీలకర్ర- టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం- 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు-రుచికి తగినంత, ఫ్రై కోసం నూనె 


తయారీ విధానం:  బౌల్‌లో శనగపిండి, కొంచెం కారంపొడి, ఉప్పు, తగినన్ని నీళ్లుపోసి పకోడాలకోసం కలపాలి. ఆ తర్వాత నూనె వేడి చేసి పకోడిలు వేయాలి. పకోడాలు చల్లబడ్డాక తరిగినట్లు గ్రైండ్‌ చేయాలి. ఆ మిక్చర్‌లోకి సగం కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చి నిమ్మరసం వేయాలి. ఆ మిశ్రమాన్నంతా క్యాప్సికమ్‌లో కూరి పక్కన ఉంచుకోవాలి. గ్రే కోసం తరిగిన ఉల్లిపాయలు, జీరాను గోల్డెన్‌ బ్రౌన్‌ వచ్చేంత వరకూ వేయించాలి. అందులోకి పసుపు, కారంపొడి, ఉప్పు వేయాలి. కాసేపయ్యాక నీళ్లు కలపాలి. మంట తగ్గించి టొమాటో పేస్ట్‌ వేయాలి. అరకప్పు నీళ్లు పోసి గరిటెతో కదిలిస్తుండాలి. ఆ తర్వాత స్టఫ్డ్‌ క్యాప్సికమ్‌లను ఉంచాలి. మూత ఉంచి క్యాప్సికమ్‌ మెత్తగా అయ్యేంత వరకూ కుక్‌ చేయాలి. గార్నిష్‌ చేసి అన్నంతో స్టఫ్డ్‌ క్యాప్సికమ్‌ పకోడిని తినాలి. 


భగారే టొమాటొ

కావాల్సిన పదార్థాలు

టొమాటొలు-10 (పైన భాగంలో నాలుగుచోట్ల కత్తితో గాటు పెట్టాలి), నూనె- అరకప్పు, చింతపండు గుజ్జు- అరకప్పు, కారంపొడి-టేబుల్‌ స్పూన్‌, పసుపు- అరటేబుల్‌ స్పూన్‌, కరివేపాకు- పది ఆకులు, పచ్చి మిరపకాయలు-5 

(సగానికి చీల్చాలి), పల్లీలు- 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు- టేబుల్‌ స్పూన్‌, ఆవాలు- కొద్దిగా, దనియాలు- టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర- టేబుల్‌ స్పూన్‌, ఎండు కొబ్బరి- 5 (రెండు ఇంచులుండాలి ఒక్కోటి), ఉప్పు- రుచికి


తయారీ విధానం: పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుకొబ్బరిని వేయించి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్‌ చేసుకున్నాక.. ఒక ప్యాన్‌లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడేప్పుడు మంట తగ్గించాలి. తర్వాత గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు వేయాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసి నూనె బుడగలు పైకి వచ్చేంత వరకూ గరిటెతో మిశ్రమాన్ని కదపాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, పచ్చి మిరపలు వేశాక నీళ్లు పోసి మిక్స్‌ చేస్తూ ఉండాలి. మూత ఉంచి ఆ ప్యాన్‌లోని మిశ్రమం సగానికంటే తక్కువ అయ్యేంత వరకూ ఉడికించాలి. టొమాటోలు వేయాలి. మూత పెట్టి కొద్ది సేపు కుక్‌ చేయాలి. దీన్ని అన్నంతో లేదా చపాతీలతో తినొచ్చు.


తయారీ విధానం

నానబట్టిన గోధుమరవ్వను ప్రెషర్‌ కుక్కర్‌లో నీళ్లు పోసి కుక్‌ చేసి పక్కనబెట్టుకోవాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసి ప్యాన్‌ పెట్టాలి. ఉల్లిపాయలు వేయించాలి. అందులో సగం గార్నిషింగ్‌ కోసం పక్కన ఉంచుకోవాలి. మంట తగ్గించి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారంపొడి, పసుపు,  ఉప్పు వేయాలి. నానబెట్టిన సోయా గ్రానుల్స్‌ వేసి మసాలా కలపాలి. నీళ్లు ఆవిరయ్యేంత వరకూ ఫ్రై చేయాలి. పెరుగు వేసి కాసేపు కుక్‌ చేయాలి. ఆ తర్వాత అడుగు లోతు ఉండే ప్యాన్‌ తీసుకోవాలి. రవ్వ పేస్ట్‌, సోయాకర్రీ, నెయ్యి, గరం మసాలాపొడి, కొత్తిమీర ఆకులు, పుదీనాఆకులు వేసి మిక్స్‌ చేయాలి. మిశ్రమం మరీ గట్టిగా అయితే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత  మంట తగ్గించి సోయా మిశ్రమాన్ని గట్టిగా కలియబెట్టాలి. సోయా హలీమ్‌ రెడీ. దీనికి గార్నిష్‌ చేసుకుని వేడి వేడిగా తినాలి. 


Updated Date - 2022-08-06T05:52:13+05:30 IST