హరిత ‘అనంత’గా మారుస్తాం

ABN , First Publish Date - 2021-02-26T06:41:14+05:30 IST

జిల్లాలో అడవుల శాతం పెంచి.. ఎడారి ఛాయలను తరిమికొట్టి.. హరిత అనంతగా మార్చడానికి కృషి చేస్తానని అటవీశాఖ నూతన కన్జర్వేటర్‌ శ్రీనివాస శాస్ర్తి అన్నారు.

హరిత ‘అనంత’గా మారుస్తాం

నూతన అటవీశాఖ కన్జర్వేటర్‌ శ్రీనివాస శాస్ర్తి 

అనంతపురం రైల్వే, ఫిబ్రవరి 25 : జిల్లాలో అడవుల శాతం పెంచి.. ఎడారి ఛాయలను తరిమికొట్టి.. హరిత అనంతగా మార్చడానికి కృషి చేస్తానని అటవీశాఖ నూతన కన్జర్వేటర్‌ శ్రీనివాస శాస్ర్తి అన్నారు. గురువారం అటవీశాఖ కన్జర్వేటర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2015, 2017 సోషల్‌ పారెస్ట్‌ రికార్డుల ప్రకారం అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. అటవీ ప్రాంతాలతోపాటుఇతర ప్రాంతాల్లో మొక్కలు పెంచడం ద్వారా అది సాధ్యమైందన్నారు. ఈ ఎడాది వర్షాలు బాగా పడటంతో ఎక్కడ చూసినా అడవులు పచ్చగా.. దట్టంగా పెరిగాయన్నారు. వాటిని ఈ వేసవిలో కాపాడుకోవటం సవాల్‌గా మారిందన్నారు. అడవిలో అగ్ని ప్రమాదాలు సాధారణమని,  సిబ్బంది త్వరగా స్పందిస్తే నష్ట శాతాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఎనఆర్‌జీఎ్‌స, కాంపా స్కీమ్స్‌ ద్వారా నర్సరీలు పెంచి ప్రత్యామ్నాయ అటవీకరణకు చర్యలు చేపడతామన్నారు. ప్రజలు కూడా విరివిగా మొక్కలు పెంచాలన్నారు. 


అడవులను కాపాడుకుందాం

 అడవుల సంరక్షణ అందరి బాధ్యతని అనంతపురం సర్కిల్‌ అటవీశాఖ కన్జర్వేటర్‌ శ్రీనివాస శ్రాసి్త్ర సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన చిత్తూరు, అనంతపురం జిల్లాల అటవీశాఖ సిబ్బందితో తమ చాంబర్‌లో మాట్లాడారు. అటవీ శాఖ సిబ్బంది పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. కరువు జిల్లా అయిన అనంతపురంలో అడవుల సంరక్షణ చాలా అవసరమన్నారు. ఆ దిశగా అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీఎ్‌ఫఓలు జగన్నాథ్‌సింగ్‌, చిత్తూరు డీఎ్‌ఫఓ రవిశంకర్‌, చిత్తూరు సోషల్‌పారెస్ట్‌ డీఎ్‌ఫఓ శ్రీనివాసులు, సబ్‌ డీఎ్‌ఫఓ శ్యామ్యూల్‌, అనంతపురం జిల్లా రేంజర్లు సూర్యచంద్రరాజు, వేణుగోపాల్‌, రవిశంకర్‌, రాంసింగ్‌, డేవిడ్‌, శ్రీనివాసులు, సోసెల్‌ పారెస్ట్‌ రేంజర్‌ ఉదయ్‌కుమార్‌, చిత్తూరు జిల్లా రేంజర్లు బాలక్రిష్ణారెడ్డి, సుభాస్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T06:41:14+05:30 IST