గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నూతన కార్యవర్గాలు

ABN , First Publish Date - 2022-08-10T07:03:19+05:30 IST

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (ఏపీజీడబ్ల్యూఎ్‌సఈడబ్ల్యువో) ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కమిటీల ఏర్పాటు మంగళవారం జరిగింది. ఏపీజీడబ్ల్యూఎ్‌సఈడబ్ల్యువో ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల సర్వసభ్య సమావేశం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జేసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నూతన కార్యవర్గాలు

- కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల నూతన కార్యవర్గాల ఏర్పాటు 

- విజయవాడ రెవెన్యూ భవన్‌లో మూడు జిల్లాల అత్యవసర సమావేశం 

విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (ఏపీజీడబ్ల్యూఎ్‌సఈడబ్ల్యువో) ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కమిటీల ఏర్పాటు మంగళవారం జరిగింది. ఏపీజీడబ్ల్యూఎ్‌సఈడబ్ల్యువో ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల సర్వసభ్య సమావేశం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జేసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీజీడబ్ల్యూఎ్‌సఈడబ్ల్యువో రాష్ట్ర అడ్‌హక్‌ ప్రెసిడెంట్‌ ఎ.సాయినాథరెడ్డి అఽధ్యక్షత వహించారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చ జరిగింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఇంకా 2 వేలమంది సచివాలయ ఉద్యోగులకు ప్రొబెషన్‌ పూర్తి చేయడం, ఉద్యోగుల జీతభత్యాలు మాతృశాఖ ద్వారా నిర్వహించటం, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం, జాబ్‌చార్ట్‌ ప్రకారం విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవటం, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెల్లించటం, అర్హులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడం, బదిలీలు నిర్వహించటం తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో  ఉపాధ్యక్షుడు షమీర్‌ హుస్సేన్‌, ప్రధాన కార్యదర్శి అరలయ్య, కోశాధికారి సల్మాన్‌ బాషా, నాయకులు జగదీశ్‌, రాజశేఖర్‌, బి.జగదీష్‌, రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యులు

ఏపీ గ్రామ వార్డు సచివాల ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఎన్టీఆర్‌ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడు దుర్గారావు, ఉపాధ్యక్షుడు కె.త్రివిక్రమ్‌ ఆదిత్య, కార్యదర్శి టి.వెంకటమోహన్‌, సహాయ కార్యదర్శి ఎస్‌కే షరీఫ్‌, కోశాధికారి ప్రశాంత్‌ నాయక్‌లు ఎన్నికయ్యారు. అలాగే కృష్ణాజిల్లా అధ్యక్షుడు బి.జగదీశ్‌బాబు, ఉపాధ్యక్షుడు బి.చైతన్య కుమార్‌, కార్యదర్శి సామ్యూల్‌ రాజు, సహాయ కార్యదర్శి రథు, కోశాధికారిగా ఫణిలు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లాకు అధ్యక్షుడు ఉన్నవ పార్థు, ఉపాధ్యక్షుడు రియాజ్‌, కార్యదర్శి దుర్గా నాయక్‌, సహాయ కార్యదర్శి నాగరాజు, కోశాధికారిగా బాబురావులు ఎంపికయ్యారు.  

Updated Date - 2022-08-10T07:03:19+05:30 IST