బాధ్యతలు స్వీకరిస్తున్న రంజిత్ బాషా
కమిషనర్ రంజిత్ బాషా బాధ్యతల స్వీకరణ
చిట్టినగర్, జనవరి 27 : విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని కొత్త మునిసిపల్ కమిషనర్ రంజిత్ బాషా అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడటంతో పాటు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. పారిశుధ్యం, ఆరోగ్యం, విద్యతో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని అంశాలతో నగరాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తొలుత ఆయనకు వివిధ విభాగాల అధికారులు స్వాగతం పలికారు.