హైదరాబాద్‌లో షోరూమ్ మొదటి అంతస్తు నుంచి కొత్త కారు పల్టీ

ABN , First Publish Date - 2021-07-20T01:32:33+05:30 IST

హైదరాబాద్‌లో షోరూమ్ మొదటి అంతస్తు నుంచి కొత్త కారు పల్టీ

హైదరాబాద్‌లో షోరూమ్ మొదటి అంతస్తు నుంచి కొత్త కారు పల్టీ

హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అలకాపురి సిగ్నల్ వద్ద టాటా మెటర్ షోరూంలో ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తు నుంచి కారు పల్టీ కొట్టింది. షోరూంలో ఓ వ్యక్తి కారు కొనుగోలు చేశారు. అయితే మొదటి అంతస్తులో ఉన్న కారును వ్యక్తి స్టార్ట్ చేసి లిఫ్టు మీదకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఈ తరుణంలో కారు దూసుకెళ్లి మొదటి అంతస్తు నుంచి కింద ఉన్న కార్లపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షోరూమ్ యాజమన్యం నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 

Updated Date - 2021-07-20T01:32:33+05:30 IST