Abn logo
Oct 17 2021 @ 01:01AM

రైల్వే స్పోర్ట్సు సముదాయంలో కొత్త బాక్సింగ్‌ రింగ్‌

బాక్సింగ్‌ రింగ్‌ను ప్రారంభిస్తున్న పారిజాత సత్పతీ

విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 16: వాల్తేరు రైల్వే స్పోర్ట్సు సముదాయంలోని ఇండోర్‌ బాక్సింగ్‌ హాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త బాక్సింగ్‌ రింగ్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ రింగ్‌ను వాల్తేరు రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షరాలు పారిజాత సత్పతీ ప్రారంభించారు. ఆధునిక స్పీడ్‌బాల్‌, పంచింగ్‌ బ్యాగ్స్‌, అబ్డామినల్‌ ప్యాడ్స్‌, హెడ్‌ గార్డ్సు వంటి  ఎక్యూప్‌మెంట్‌తో కూడిన కొత్త రింగ్‌ ఏర్పాటుకు  రైల్వే స్పోర్ట్సు ప్రమోషన్‌ బోర్డు(ఆర్‌ఎస్‌పీబీ) నిధులు సమకూర్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధీర్‌కుమార్‌ గుప్తా, స్పోర్ట్సు ఆఫీసర్‌ ప్రదీప్‌ యాదవ్‌, సహాయ క్రీడాధికారులు,  రైల్వే మహిళా సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.