నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-27T05:35:27+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్య వసాయ చట్టాలను వెంటనే ర ద్దు చేయాలని సీఐటీయూ రా ష్ట్ర కార్యదర్శి రమ డిమాండ్‌ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
మాట్లాడుతున్న రమ

బీర్కూర్‌, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్య వసాయ చట్టాలను వెంటనే ర ద్దు చేయాలని సీఐటీయూ రా ష్ట్ర కార్యదర్శి రమ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆమె జీపు జాతా కార్యక్రమంలో భా గంగా బీర్కూర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పం దించి ప్రజా వ్యతిరేక విధానాల ను విడనాడాలని, వ్యవసాయ చట్టాలను ఉప సంహరించు కోవాలని అన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2020ను సైతం రద్దు చేయాలన్నారు. ఈ చట్టాలు ఉప సంహరించే వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌, రవీందర్‌, ఆనంద్‌, సాయిలు, శివ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:35:27+05:30 IST