జీవిత భాగస్వామితో ఈ నాలుగు విషయాలు పొరపాటున కూడా చెప్పకండి.. లేదంటే మీ వైవాహిక జీవితం చిక్కుల్లో పడుతుంది!

ABN , First Publish Date - 2021-10-13T16:33:56+05:30 IST

ప్రతీ మనిషికీ గత జీవితం అంటూ ఉంటుంది.

జీవిత భాగస్వామితో ఈ నాలుగు విషయాలు పొరపాటున కూడా చెప్పకండి.. లేదంటే మీ వైవాహిక జీవితం చిక్కుల్లో పడుతుంది!

ప్రతీ మనిషికీ గత జీవితం అంటూ ఉంటుంది. ఎన్నో అనుభవాలు, అనుభూతులు, అనుబంధాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ దాటి, ఒక వయస్సు వచ్చాక వివాహబంధం  అనేది ఏర్పడుతుంది. ఈ బంధం జీవితాంతం నిలిచివుంటుంది. పరస్పన నమ్మకం, గౌరవాల మీద ఇది ఆధారపడివుంటుంది. కొంతమంది తన గత జీవితంలో ఎదురైన అన్ని అనుభవాలను భాగస్వామితో చెప్పడం మంచిదని భావిస్తారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒక్కోసారి ఇలా వ్యవహరించడం వలన భార్యాభర్తల అనుబంధం దెబ్బదింటుంది. ఇది విడాకుల వరకూ దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే మన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను, అనుబంధాలను భాగస్వామితో చెప్పకూడదు. ముఖ్యంగా ఈ నాలుగు విషయాలు భాగస్వామికి ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు.


ఎక్స్‌ని ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారా?

మీ ఎక్స్ గురించి ఎప్పటికీ మీ భాగస్వామితో చెప్పవద్దు. అలాగే తరచూ మీరు మీ ఎక్స్‌ను గుర్తుచేసుకుంటుంటే మీ వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మీ ఎక్స్ గురించి మీరు మీ భాగస్వామి వద్ద ప్రస్తావించినపుడు ఆమె లేదా అతడు మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించలేకపోతారు. అందుకే గతకాలపు ఎక్స్‌ను గుర్తు చేసుకోకుండా వర్తమానంలో ఉంటడం ఎంతో ముఖ్యం. 

పెళ్లి చేసుకుని తప్పుచేశానని అంటున్నారా?

భార్యా భర్తలమధ్య అప్పుడప్పుడూ గొడవలు వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో భార్య లేదా భర్త తాను పెళ్లి చేసుకుని తప్పు చేశానని అంటుంటారు. ఇది మీ భాగస్వామి మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. ఫలితంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇద్దరి కుటుంబాలలోనూ వీరి గురించి చెడ్డగా మాట్లాడుకునేందుకు అవకాశం కలుగుతుంది. 


గతంలో ఎంతమందితో డేట్‌కి వెళ్లారు?

మీ గత జీవితం గురించి భాగస్వామికి చెప్పేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మీరు గతంలో ఎంతమందితో డేట్‌కి వెళ్లినా.. అ విషయాలను భాగస్వామికి చెప్పకండి. గతాన్ని మరచిపోయే ప్రయత్నం చేయండి. పెళ్లి చేసుకున్న తరువాత భాగస్వామే తన సర్వస్వం అని భావించాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడతారు. 

ఎక్స్‌తో ఎటువంటి ప్లానింగ్ అయినా చేసుకున్నారా?

పెళ్లికి ముందు మీరు ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే, ఆ విషయాన్ని పెళ్లయిన తరువాత మీ భాగస్వామికి ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకండి. ఇటువంటివి వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. గడిచినదేదో గడిచిపోయింది. వర్తమానమే ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకుని భాగస్వామితో ఆనందంగా జీవించండి. ఈ Relationship Tips ప్రముఖ మానసిక వైద్యులు ఇచ్చిన సలహాల నుంచి సంగ్రహించినవని గమనించగలరు. 

Updated Date - 2021-10-13T16:33:56+05:30 IST