శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ సమాజం మరువలేదు

ABN , First Publish Date - 2020-12-04T06:41:07+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికి మరువలేదని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు

శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ సమాజం మరువలేదు
ఖానాపూర్‌లో శ్రీకాంతాచారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఖానాపూర్‌, డిసెంబరు 3 : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికి మరువలేదని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. గురువారం శ్రీకాంతాచారి వర్ధంతి ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని పలువురు కొనియాడారు. అనంతరం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, ఏఎంసీ చైర్మన్‌ గంగ నర్సయ్య, వైస్‌ చైర్మన్‌ శ్రావణ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజ గంగన్న, కౌన్సిలర్‌ కావాలి సంతోష్‌, కురుమ శ్రీను, నాయకులు కొక్కుల ప్రదీప్‌, గుగ్గిళ్ళ సతీష్‌, బండారి కిషోర్‌, పరిమి సురేష్‌; తూము చరణ్‌, రామిడి మహేష్‌, పరాంకుసం శ్రీనివాస్‌, కౌట మహేష్‌, మణికంఠ, కడారి బీరయ్య, తదితరులు ఉన్నారు. 

నిర్మల్‌ అగ్రికల్చర్‌, డిసెంబరు 3 : తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన విశ్వ బ్రహ్మణ పులిబిడ్డ శ్రీకాంతాచారి ప్రాణత్యాగం వెలకట్టలేనిదని నిర్మల్‌ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కోటరిగి శ్రీధర్‌ అన్నారు. గురువారం నిర్మల్‌ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్ట మొదట శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం చేయడంతో తెలంగాణ ఉద్యమానికి పూపు వచ్చిందని ఆయన ఉద్యమ స్ఫూర్తిని మనమందరం గుర్తుంచుకోవాలని అన్నారు. విశ్వబ్రహ్మణ సంఘం నేతలు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవరశెట్టి గణేష్‌, మేడారం ప్రదీఫ్‌, వన్నెపల్లి శివకుమార్‌, చిలుముల నర్సయ్య, సుద్దాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T06:41:07+05:30 IST