chanakya niti: శత్రువుల ముందు ఈ తప్పులు చేయకండి..లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు!

ABN , First Publish Date - 2022-09-22T12:09:39+05:30 IST

ఆచార్య చాణక్యుడి విధానాలను అనుసరించడం...

chanakya niti: శత్రువుల ముందు ఈ తప్పులు చేయకండి..లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు!

ఆచార్య చాణక్యుడి విధానాలను అనుసరించడం ద్వారా మనిషి తన జీవితాన్ని విజయవంతంగా మలుచుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విద్య, మానవ సంబంధాలు, వ్యాపారానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మనిషి శత్రువుల ముందు చేయకూడని కొన్ని తప్పులను కూడా తెలియజేశారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బలహీనత వ్యక్తి పరచడం 

బలహీనత అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. తన బలహీనతను ఇతరులకు చెప్పకూడదు. ముఖ్యంగా శత్రువుల ముందు బలహీనతను వ్యక్తపరచకూడదు. ఇలాచేస్తే చెడు పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే మన బలహీనతలను శత్రువు ముందు వ్యక్తపరచకూడదు.


సహనం వీడవద్దు

శత్రువు ముందు మీరు సహనం కోల్పోకూడదు. మీరు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ, సహనాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వీడవద్దని ఆచార్య చాణక్య తెలిపారు. శత్రువు నుంచి ఓటమి ఎదురైనా ప్రశాంతంగా ఉండండి. ఓపికపట్టండి. ఎప్పుడూ గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. ప్రయత్నించడానికి ఎప్పుడూ భయపడకండి. మీ మనోభావాలను దెబ్బతీసుకోకుండా మెలగాలని ఆచార్య చాణక్య సూచించారు.

శత్రువును బలహీనునిగా భావించవద్దు

ఎవరైనాసరే తన శత్రువును బలహీనునిగా భావించకూడదు. చాలాసార్లు మనిషి తనను తాను చాలా శక్తివంతునిగా భావించి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. మీ శత్రువు దీనిని అనువుగా ఉపయోగించుకుంటాడు. అందుకే శత్రువు ముందు అప్రమత్తంగా మెలగాలని ఆచార్య చాణక్య సూచించారు.

Updated Date - 2022-09-22T12:09:39+05:30 IST