Abn logo
Sep 26 2021 @ 18:28PM

వారి ఆర్ధిక మూలాలను దెబ్బతీయాలి: అమిత్ షా

న్యూఢిల్లీ : వామపక్ష తీవ్రవాదుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయడం ముఖ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఇలా చేస్తే ఏడాదిలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే దీని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థలు మరింత సమన్వయంతో చురుగ్గా పని చేయాలని సూచించారు. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో షా భేటీ అయ్యారు. వామపక్ష తీవ్రవాద సమస్యపై చర్చించారు. మావోయిస్టుల కారణంగా గడచిన 40 సంవత్సరాల్లో 16 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని షా ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ హాజరయ్యారు. సమావేశానికి చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ డుమ్మా కొట్టారు. అయితే సమావేశానికి రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు కూడా హాజరు కావడంతో సీఎం భూపేశ్ గైర్హాజరును రాజకీయ కోణంలో చూడలేమని షా అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption