నేత్రపర్వంగా ఊంజల్‌ సేవోత్సవం

ABN , First Publish Date - 2022-05-28T05:57:42+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సువర్ణ పుష్పార్చన లు, ఊంజల్‌ సేవోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా సాగాయి. ప్రధానాలయంలో స్వయంభువులను కొలిచిన ఆచార్యులు ప్రతిష్ఠా అలంకారమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు.

నేత్రపర్వంగా ఊంజల్‌ సేవోత్సవం
అష్టభుజి అంతర్‌ప్రాకార మండపంలో ఆండాల్‌ అమ్మవారిని ఊరేగిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, మే 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సువర్ణ పుష్పార్చన లు, ఊంజల్‌ సేవోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా సాగాయి. ప్రధానాలయంలో స్వయంభువులను కొలిచిన ఆచార్యులు ప్రతిష్ఠా అలంకారమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం, తులసీ దళాలు, కుంకుమ సహస్రనామార్చన నిర్వహించారు. ప్రధానాల య ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అష్టభుజి ప్రాకారమండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన శివాలయంలో నిత్యకైంకర్యాలు, కొండకింద పాతగోశాలలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. సాయంత్రం ప్రధానాలయంలో ఆండాల్‌ అమ్మవారి ని దివ్యమనోహరంగా అలంకరించి అద్దాల మండపంలోని ఊంజల్‌ సేవ వేదమంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ నేత్రపర్వంగా నిర్వహించారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలో నూ స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం సంప్రదాయరీతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా రూ.19,06,407 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరిన ట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారని దేవస్థాన ఇన్‌చార్జి ఈవో రామకృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-05-28T05:57:42+05:30 IST