Abn logo
Sep 28 2021 @ 16:27PM

సిద్ధూ రాజీనామా: కాంగ్రెస్‌పై నెటిజెన్ల సెటైర్లు

చండీగఢ్: మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది రోజులకే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. మరో ఆరు నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడం.. ఇలాంటి సమయంలో వరుస రాజీనామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ బలాబలాలు, ఎదుగుదల-క్షీణత అంశాలు పక్కన పెడితే సిద్ధూ రాజీనామా చేయడంపై నెటిజెన్లు అయితే కాంగ్రెస్‌పై అనేక సెటైర్లు వేస్తున్నారు.


పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని.. కెప్టెన్ రాజీనామాతో కాంగ్రెస్ సగం బలహీన పడితే, సిద్ధూ రాజీనామాతో పూర్తిగా చెదిరిపోయిందని నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సిద్ధూకి కాంగ్రెస్ ఎంతో చేసిందని, అయితే సిద్ధూ పార్టీకి విశ్వనీయంగా ఉండలేకపోయారని కాంగ్రెస్ మద్దతుదారులు అంటుంటే.. అనుకున్నట్లుగానే పని పూర్తి చేశారని త్వరలోనే బీజేపీకి తిరిగి వస్తారని బీజేపీ మద్దతుదారులు ట్రోల్స్ వేస్తున్నారు. కపిల్ శర్మ షో కంటే పెద్ద కామెడీ షోలా కాంగ్రెస్ పార్టీ మారిపోయిందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.


సిద్ధూ రాజీనామాపై నెటినెజ్లు వేస్తున్న ట్రోల్స్‌లో కొన్ని..











ఇవి కూడా చదవండిImage Caption