Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 18 May 2022 16:01:34 IST

Cannes Film Festival 2022: చీరతో రెట్రో లుక్‌లో Deepika Padukone.. డిజాస్టర్ అంటూ ట్రోలింగ్

twitter-iconwatsapp-iconfb-icon
Cannes Film Festival 2022: చీరతో రెట్రో లుక్‌లో Deepika Padukone.. డిజాస్టర్ అంటూ ట్రోలింగ్

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival) 2022లో భారత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ జ్యూరీకి సభ్యురాలిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ వేడుకకి మొదటి రోజు సెలబ్రేషన్స్‌కి ఈ భామ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ (Sabyasachi Mukherjee) డిజైన్ చేసిన చీరలో హాజరైంది. ఈ బ్యూటీ దీనికి సంబంధించిన పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. అయితే ఆ లుక్ చాలామంది నెటిజన్లకు నచ్చలేదు. దీంతో విపరీతంగా ట్రోలింగ్ చేశారు.


దీపిక చేసిన ఆ పోస్ట్‌కి.. ‘చీరకి ఓ కథ ఉంటుంది.. అది నేను చెప్పకుండా ఉండలేను. ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నామనే దాంతో సంబంధం లేకుండా అక్కడ చీరకి ప్రత్యేక స్థానం ఉంటుందని సబ్యసాచి ముఖర్జీ నాతో చెప్పారు. నేను ఆయనతో అంగీకరించకుండా ఉండలేకపోతున్నాను’ అని రాసుకొచ్చింది. ఈ లుక్‌లో దీపికని చూసిన అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తుండగా.. చాలామంది నెటిజన్లకి ఈ భామ లుక్స్ నచ్చలేదు. దీంతో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.


‘నిజాయితీగా చెప్పాలంటే.. నాకు దీపిక లుక్ నచ్చలేదు.. మరింత రిచ్‌గా ఉండాలి’ అని ఓ నెటిజన్.. ‘ఆ కంటికి ఆ మేకప్ ఏంటి.. అది లేకుండా ఆమె మరింత అందంగా ఉంటుంది’ అని మరో నెటిజన్.. ‘ఆమె లుక్ డిజాస్టర్ అయ్యింది.. అస్సలు బాగాలేదు’ అని కామెంట్స్ చేశారు. మరికొందరు సైతం ‘భయంకరంగా ఉంది’, ‘మేకప్ అస్సలు బాగాలేదు’, ‘కంటికి అంతా మేకప్ అవసరమా’ అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...