Modi ఉద్యోగ ప్రకటన.. #ThankyouVarunGandhi అంటున్న Netizens

ABN , First Publish Date - 2022-06-14T23:55:15+05:30 IST

మే 28న వరుణ్ గాంధీ ఈ ట్విట్ చేయగా.. వరుణ్ గాంధీ షేర్ చేసిన డేటాను ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దేశంలో పెరిగిన నిరుద్యోగం, ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను..

Modi ఉద్యోగ ప్రకటన.. #ThankyouVarunGandhi అంటున్న Netizens

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime minister Narendra modi) మంగళవారం ప్రకటించారు. అయితే నెటిజెన్లు బీజేపీ(BJP) ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi)కి కృతజ్ణతలు చెబుతున్నారు. #ThankyouVarunGandhi అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. దీనికి కారణం కొద్ది రోజుల క్రితం దేశంలోని మొత్తం 60 లక్షల ఉద్యోగాలపై డేటాను వరుణ్ గాంధీ స్పందించారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలపై ఆయన డేటాను విడుదల చేస్తూ ‘‘నిరుద్యోగం మూడు దశాబ్దాలలో గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ ఈ గణాంకాలు చూస్తు ఆశ్చర్యం కలుగుతోంది. రిక్రూట్‌మెంట్లు అందుబాటులో లేకపోవడంతో కోట్లాది యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతుండగా మరొక వైపు దేశంలో 60 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం కేటాయించిన బడ్జెట్ ఎక్కడికి పోయింది? ఇది తెలుసుకునే హక్కు ప్రతి యువకుడికి ఉంది’’ అని ట్వీట్ చేశారు.


మే 28న వరుణ్ గాంధీ ఈ ట్విట్ చేయగా.. వరుణ్ గాంధీ షేర్ చేసిన డేటాను ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దేశంలో పెరిగిన నిరుద్యోగం, ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఓవైసీకి వరుణ్ గాంధీ కృతజ్ణతలు తెలియజేశారు. కాగా, ఇది ముగిసిన మరునాడే ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీ హామీ రావడం విశేషం. దీంతో నెటిజెన్లు.. వరుణ్ గాంధీ లేవనెత్తిన డేటా అనంతరమే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-06-14T23:55:15+05:30 IST