Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 23 Jun 2022 17:15:32 IST

అక్కడ సుత్తి.. ఇక్కడ కత్తి.. Shamshera సినిమాలో KGF ఛాయలు.. సంజయ్ దత్ పాత్ర కూడా సేమ్ టు సేమ్..!

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తాజాగా నటించిన సినిమా ‘షంషేరా’ (Shamshera). యశ్‌రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. వాణీ కపూర్ (Vaani Kapoor) హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్ (Sanjay Dutt) విలన్ పాత్రను పోషించారు. సినిమాలోని కీలక పాత్రధారుల ఫస్ట్‌లుక్‌లతో పాటు టీజర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ప్రేక్షకులు చాలా మంది ఈ టీజర్‌ను చూసి ‘కెజియఫ్’ ఛాయలు కనిపిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ హీరో సుత్తి పట్టుకుంటే, ఇక్కడ కత్తి పట్టుకున్నాడని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. 


‘షంషేరా’, ‘కెజియఫ్’  సినిమాల కథ సేమ్ కాదు. కానీ, ‘షంషేరాలో’ ని సంజయ్ దత్ పాత్ర, ‘కెజియఫ్’ లోని అధీరా లాగానే సేమ్ టు సేమ్ కనిపిస్తుందంటున్నారు. ఒక సినిమా హిట్ అయిందని అదే ఫార్మాట్‌ను అనుసరించి మరొకదానిని రూపొందిస్తే ప్రేక్షకులు ఆదరించారనే విషయాన్ని మేకర్స్ గమనించాలి. గతంలో సౌత్ రీమేక్స్ బాలీవుడ్‌లో బాగా నడిచేవి. ‘రౌడీ రాథోర్’, ‘కిక్’ సినిమాలు ఆ విధంగానే హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఓటీటీలు రావడంతో ప్రేక్షకులు ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూస్తున్నారు. అందువల్లే రీమేక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం అవుతున్నాయి. ‘షంషేరా’ కు కరణ్ మల్హోత్రా (Karan Malhotra) దర్శకత్వం వహించారు. జులై 22న విడుదల కానుంది. చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement