Abn logo
Jun 5 2020 @ 21:17PM

మాధవీలత సంతోషానికి కారణం ఇదేనా?

‘‘ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాను..’’ అని నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఆమె సంతోషానికి కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. కొందరు ఒక అడుగు ముందుకు వేసి అది ఖచ్చితంగా పెళ్లే అని, త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్తను బయటికి తెచ్చారు. మరి నిజంగా ఆమె సంతోషానికి పెళ్లే కారణం అయితే.. ఈ లాక్‌డౌన్ మరో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిందనే చెప్పుకోవాలి. 


అది సరే.. ఇంతకీ మాధవీలత ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది. నటుడినా? లేక రాజకీయ నాయకుడినా? అంటే దీనిపై కూడా ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. తను ప్రస్తుతం ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆమె పెళ్లాడబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయినా నేనే చెబుతాను అంటుంది కదా..! మరి ఎందుకు నెటిజన్లు ఈ విషయంలో ఇంత ఇంట్రస్ట్ పెడుతున్నారో తెలియదు కానీ.. ఆమె చెబుతున్న దానిని ప్రకారం చూస్తుంటే నెటిజన్లు చెబుతున్నట్లే.. ఆమె సంతోషానికి కారణం పెళ్లే అని అనిపిస్తుంది. చూద్దాం.. ఎటువంటి వార్తను మాధవీలత రివీల్ చేస్తుందో..

Advertisement
Advertisement
Advertisement