వైరలవుతున్న పోలీసు అధికారి వీడియో.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-02-10T02:18:07+05:30 IST

పోలీసు అధికారికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ పోలీసు అధికారిని హీరోగా అభివర్ణిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన

వైరలవుతున్న పోలీసు అధికారి వీడియో.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

వాషింగ్టన్: పోలీసు అధికారికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ పోలీసు అధికారిని హీరోగా అభివర్ణిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఓ పెంపుడు శునకం కారులో ఉండగానే.. ప్రమాదవశాత్తు ఆ కారులో మంటలు చెలరేగాయి. ఫలితంగా కారులో మొత్తంలో నల్లటి పొగ నిండిపోయింది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసు అధికారి.. ఆ శునకాన్ని కాపాడాడు. ఆ దృశ్యాలన్నీ తన యునిఫాంకు ఉన్న కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను తాజాగా పోలీసు కార్యాలయం సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. సదరు పోలీసు అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Updated Date - 2022-02-10T02:18:07+05:30 IST