Abn logo
Jun 6 2020 @ 18:05PM

ఫేస్ క్రీమ్ బ్యూటీస్‌కు ఎదురుదెబ్బ!

ప్రపంచంలో ఏదైనా అమానవీయ సంఘటన జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలచి ఫిల్మ్ సెలబ్రిటీస్ సైతం గొంతెత్తి తమ నిరసనను ఏదో ఒక స్థాయిలో వ్యక్తం చేస్తుంటారు. అలా చేయాల్సిందే. అది వ్యక్తిధర్మం. ప్రస్తుతం అమెరికాను అతలాకుతలం చేస్తున్న వర్ణ వివక్ష అంశంపై బాలీవుడ్ సెలబ్రిటీస్ తమ నిరసన తెలిపారు. అయితే ఇందులో కొందరి పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.


మరీ ముఖ్యంగా ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, దిశా పటాని వంటి అందాల తారలపై వారు దుమ్మెత్తి పోశారు. కాసుల కోసం ఫేస్ క్రీమ్ యాడ్స్‌లో నటించే మీకు వర్ణ వివక్ష గురించి మాట్లాడే హక్కులేదు పొమ్మన్నారు కొందరు. 


ఇదిలా ఉంటే... అమెరికాలో జరిగిన వర్ణ వివక్ష మీద మన సెలబ్రిటీస్ నిరసన వ్యక్తం చేయడాన్ని కొందరు హర్షిస్తూనే... మరి మనదేశంలో ఇలాంటి సంఘటనలు జరిగితే మీరంతా ఎందుకు నోరెత్తలేదంటూ పరోక్షదాడికి దిగారు. ఆ మధ్య మహారాష్ట్రలో ఓ స్వామీజీని పాల్ ఘర్‌లో అమానుషంగా చంపేసినప్పుడు మీరెందుకు ఇలా నిరసన వ్యక్తం చేయలేదంటూ ఇంకొందరు సెలబ్రిటీస్‌ను ప్రశ్నించారు. సోనమ్ కపూర్ వంటి వారైతే... 'ముందు మీ ఇంటిని శుభ్రం చేసుకోండి' అంటూ తమ నటీనటులనే పరోక్షంగా విమర్శించింది.


అయితే ఇలాంటి వాళ్ళ మీద కూడా కొందరు నెటిజన్లు కయ్యానికి కాలు దువ్వారు. మొత్తం మీద... అమెరికాలో రాజుకున్న వర్ణ వివక్ష సెగ... భారత్‌లోనూ కొంతవరకూ వేడి పుట్టిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement