Jul 9 2021 @ 19:23PM

‘తిక్క‌’ భామ ట్వీట్‌.. సాయితేజ్‌ రియాక్షన్‌ చూశారా?

‘తిక్క‌’ భామ అంటే ఎవరని అనుకుంటున్నారా?. హీరో సాయితేజ్‌ని దారుణంగా నిరాశ పరిచిన చిత్రం 'తిక్క'. వాస్తవానికి ఈ చిత్రం ఒకటి ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆ చిత్రంలో సాయితేజ్‌ సరసన హీరోయిన్‌గా నటించింది లారిస్సా బొనేసి. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌కి టాటా చెప్పేసిన ఈ భామ.. తిరిగి మళ్లీ హైదరాబాద్‌ వస్తున్నట్లుగా ట్వీట్‌ చేసింది. దీంతో నెటిజన్లు అందరూ సాయితేజ్‌ నామం జపిస్తూ.. కామెంట్స్‌ చేస్తున్నారు. కారణం ఏమిటని అనుకుంటున్నారా?. 'తిక్క' సినిమా పరాజయాన్ని పక్కన పెడితే.. ఆ సినిమా టైమ్‌లో సాయితేజ్‌కి, లారిస్సా బొనేసికి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ బాగానే వార్తలు నడిచాయి. సాయితేజ్‌ మాత్రం ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే అంటూ ఎన్ని సార్లు చెప్పినా.. నెటిజన్లు మాత్రం ఆయనని వదలలేదు. 


తర్వాత ఆమె సినిమాలు మానేసి ఫారెన్‌లో ఉన్నా.. పుట్టినరోజు టైమ్‌లో మాత్రం ఇరువైపులా శుభాకాంక్షల ట్వీట్స్‌ నడుస్తూనే ఉన్నాయి. అలాగే మధ్య మధ్యలో సాయితేజ్‌ ఆమెపై సెటైరికల్‌గా ట్వీట్స్‌ పేలుస్తూ.. నెటిజన్లకు మరింత పని కల్పిస్తూ వస్తున్నాడు. ఇక ఆమె.. ''చాలా రోజుల తర్వాత.. హైదరాబాద్‌ రావాలనుకుంటున్నాను.." అంటూ తాజాగా చేసిన ట్వీట్‌కి సాయితేజ్‌ ఇచ్చిన రిప్లయ్‌పై కూడా హాట్‌ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ''అల్లాదీన్‌.. ఆ!'' అంటూ సిగ్గుపడుతున్నట్లుగా ఉన్న ఓ జిఫ్‌ ఇమేజ్‌తో లారిస్సా ట్వీట్‌కు సాయితేజ్‌ రిప్లయ్‌ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు.. ''అన్నా.. వదిన వస్తోంది..'' అంటూ సాయితేజ్‌పై చిలిపిగా కామెంట్స్‌ చేస్తున్నారు.