ఈ చిట్టితల్లికి ఎంత గుండె ధైర్యమో.. వీడియో చూస్తేనే గుండెలు అదిరిపోతున్నాయ్.. కానీ ఈ పాప మాత్రం..

ABN , First Publish Date - 2021-11-12T22:22:03+05:30 IST

ఓ చిట్టితల్లి చేసిన పని చూసిన వారికి చెమటలు పట్టాయి. వామ్మో ఈ పాపకు ఎంత ధైర్యమో అని అనాలనిపిస్తుంది. పెద్దవారు కూడా చేయలేని పనిని.. ఆ పసిపాప చాలా ఈజీగా చేసేసింది.

ఈ చిట్టితల్లికి ఎంత గుండె ధైర్యమో.. వీడియో చూస్తేనే గుండెలు అదిరిపోతున్నాయ్.. కానీ ఈ పాప మాత్రం..

చిన్న పిల్లలు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. ఆ వయసులో వారు చేసే అల్లరి అంతాఇంతా కాదు. కొందరు పిల్లలు చేసే పనులతై ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపిస్తుంటాయి. ఓ చిట్టితల్లి చేసిన పని.. చూసిన వారికి చెమటలు పట్టించింది. చూస్తే.. వామ్మో ఈ పాపకు ఎంత ధైర్యమో అని అనాలనిపిస్తుంది. పెద్దవారు కూడా చేయలేని పనిని.. ఆ పసిపాప చాలా ఈజీగా చేసేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వారంతా... పాప గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.


ఓ పాప ఇంటి బయట అరుగుపై కూర్చుని ఉంది. అదే సమయంలో ఓ భారీ కొండచిలువ పాప వైపు పాకుతూ వెళ్లింది. వేరే పిల్లలైతే భయంతో పరుగెడుతారు. కానీ ఈ పాప మాత్రం కొండచిలువతో ఆటలు ఆడుకుంది. దాన్ని అటూ ఇటూ తిప్పుతూ కాసేపు ఆడుకుంది. అంతటితో ఆగకుండా పరుపు మీద పడుకున్నట్లుగా.. ఏకంగా దానిపైనే పడుకుంది. పాప మొఖంలో ఏమాత్రం కంగారు గానీ, భయం గానీ కనిపించలేదు. సాటి పిల్లలతో ఎలా ఆడుకుంటారో.. అచ్చం అలాగే అడుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. కొండచిలువను ఆటబొమ్మను చేసి ఆడుకుంటుందంటూ చమత్కరిస్తున్నారు. మొత్తానికి ఈ పాప ఎంతో మందితో శభాష్ అనిపించుకుంటోంది.



Updated Date - 2021-11-12T22:22:03+05:30 IST