నేటి నుంచి వీరాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-23T03:19:51+05:30 IST

కావలి మద్దూరుపాడులోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నూతన ఆలయ

నేటి నుంచి వీరాంజనేయ   విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు
మాట్లాడుతున్న ఆలయ అర్చకుడు, కమిటీ సభ్యులు

కావలి,మే22: కావలి మద్దూరుపాడులోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నూతన ఆలయ విమాన శిఖర జీర్ణోద్ధరణ, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకుడు, కమిటీ  సభ్యులు తెలిపారు.  ఆలయ ప్రాంగణంలో ఆది వారం విగ్రహప్రతిష్ఠ కరపత్రాలను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం అంకురార్పణ, 24న  అర్చనలు, నైవేధ్యాలు, తీర్థప్రసాద వినియోగాలు, గ్రామోత్సవం జరుగుతాయన్నారు. 25వ తేదీ ఉదయం యంత్రప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, అనంతరం వీరాంజనేయస్వామి, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు దీవి రమేషాచార్యులు  కమిటీ సభ్యులు కేతిరెడ్డి రామకోటారెడ్డి, మన్నెమాల గోవిందరెడ్డి, గుత్తికొండ కిషోర్‌బాబు, పోతుగంటి రోశయ్య, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T03:19:51+05:30 IST