నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2022-01-18T05:07:43+05:30 IST

జిల్లాలోని బియ్యం కార్డుదారులకు మంగళవారం నుంచి ప్రఽధానమం త్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయిస్తున్నామని జిల్లా పౌర సరఫరాలశాఖాధికారి వెంకటేశ్వర్లు చెప్పారు.

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

నెల్లూరు(హరనాథపురం), జనవరి 17 : జిల్లాలోని బియ్యం కార్డుదారులకు మంగళవారం నుంచి ప్రఽధానమం త్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయిస్తున్నామని జిల్లా పౌర సరఫరాలశాఖాధికారి వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేషన్‌ షాపుల్లో ఈ బియ్యాన్ని ఇస్తారని తెలిపారు.  జిల్లాలో 8.60 లక్షలమంది బియ్యం కార్డుదారులు ఉన్నారని, వీరందరికీ డిసెంబరు, జనవరి నెలలకు సంబంధించి పీఎంజీకేవై కింద కార్డులోని ఒక్కొక్క వ్యక్తికి నెలకు ఐదు కేజీల వంతున రెండునెలలకు కలిపి పది కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామన్నారు. కార్డుదారులు కొవిడ్‌ నిబంధన లు పాటిస్తూ ఉచిత బియ్యం తీసుకోవాలని ఆయన కోరారు. 


చక్కెర గల్లంతు 

 ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ఎండీయూ ఆపరేటర్‌ల ద్వారా అందచేస్తున్న చక్కెరను జనవరి నెలలో ఇవ్వలేదు. తత్ఫలితంగా 8.59 లక్షల మంది కార్డుదారులు జవనరి నెల కోటా చక్కెర పొందలేక పోయారు. పండుగలకు కూడా చక్కెర ఇవ్వకపోవటం పట్ల పలువురు కార్డుదారులు విచారం వ్యక్తం చేశారు. చక్కెర ఇవ్వకపోయినా దాని స్థానంలో బెల్లం ఇవ్వొచ్చుకదా ? అని వారు వాపోయారు.  ఈ విషయమై సివిల్‌ సప్లయీస్‌ అధికారులను ప్రశ్నించగా, సప్లయర్‌ చక్కెరను సరఫరా చేయక పోవటం వల్ల జనవరిలో రేషన్‌ షాపులకు చక్కెర  సరఫరా జరగలేదని తెలిపారు. చక్కెర సప్లయర్‌ను మార్చేశామని చెప్పారు. కొత్తవారిని పెట్టామని, ఇక మీదట చక్కెరను ఎలాంటి ఇబ్బందులు  కార్డుదారులకు  అందచేస్తామని చెప్పారు.

Updated Date - 2022-01-18T05:07:43+05:30 IST