Jun 15 2021 @ 07:33AM

నెట్‌ఫ్లిక్స్‌..స‌మంత‌కు భారీ రెమ్యున‌రేష‌న్..!

ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్, సమంత అక్కినేనికి దక్షిణాదిలో మరే హీరోయిన్‌కు లేనంత భారీ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న స‌మంత..డిజిట‌ల్ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన‌ దిఫ్యామిలీ మేన్ సీజ‌న్ 2లో తమిళ తీవ్ర‌వాది రాజీ పాత్ర‌లో న‌టించి అంద‌రి ప్రశంసలు అందుకుంటోంది. ఈ వెబ్ సిరీస్‌లో న‌టించినందుకు స‌మంత‌కు స‌ద‌రు డిజిట‌ల్ సంస్థ నాలుగు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను ఇచ్చింద‌ని టాక్ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు మరో డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స‌మంత‌తో భారీ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని టాక్‌. అందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ స‌మంత‌కు ఎనిమిది కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను ఆఫ‌ర్ చేశార‌ని నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.