భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. నేడు, రేపు మాత్రమే!

ABN , First Publish Date - 2020-12-05T22:37:18+05:30 IST

‘స్ట్రీమ్‌ఫెస్ట్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో నేటి నుంచి రెండు రోజులపాటు ఉచిత సేవలు అందిస్తోంది. సైన్ చేసుకుని నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీని 48

భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. నేడు, రేపు మాత్రమే!

న్యూఢిల్లీ: ‘స్ట్రీమ్‌ఫెస్ట్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో నేటి నుంచి రెండు రోజులపాటు ఉచిత సేవలు అందిస్తోంది. సైన్ చేసుకుని నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీని 48 గంటలపాటు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఉచిత యాక్సెస్ స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డీ)కి మాత్రమే పరిమితం. మిగతా అన్నీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్‌కు లభించనట్టే లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే రూ. 499 బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లో లభించే అన్ని ప్రయోజనాలు ఈ రెండు రోజుల్లో ఉచితంగా లభిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లతోపాటు, క్రోమ్‌కాస్ట్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ వంటి స్ట్రీమింగ్ పరికరాల ద్వారా టీవీకి కనెక్ట్ అయి కూడా వీక్షించొచ్చు. ఇందుకోసం ఎవరూ తమ పేమెంట్ వివరాలను కానీ, క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లను కానీ ఇవ్వాల్సిన పనిలేదు. అలాగే, ఫోన్ నంబరు, ఈమెయిల్స్, పాస్‌వర్డ్ వంటి వాటితో కూడా పనిలేదు.   

Updated Date - 2020-12-05T22:37:18+05:30 IST