Sep 23 2021 @ 14:46PM

నెట్ ఫ్లిక్స్ వారికే ‘శ్యామ్ సింగరాయ్’ డిజిటల్ రైట్స్ ?

నేచురల్ స్టార్ నానీ హీరోగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలు గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ ‘శ్యామ్ సింగరాయ్’. నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయిన పల్లి నిర్మిస్తున్న ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి బైటికి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్ థియేటర్స్ లో విడుదలైన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సత్యదేవ్ జంగా కథ అందించారు. బిఫోర్ ఇండిపెండెన్స్ కలకత్తాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. గతంలో విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి సంబంధిచిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని కలిగించాయి. మరి ఈ సినిమా నానీకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.