జిల్లా నెట్‌బాల్‌ సీనియర్‌ జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-12-06T05:44:41+05:30 IST

జిల్లా నెట్‌బాల్‌ సంఘ ఆధ్వర్యంలో గుంటూరు బీఆర్‌ స్టేడియంలో ఆదివారం మహిళలు, పురుషులు విభాగంలో జిల్లా నెట్‌బాల్‌ జట్ల ఎంపిక చేసినట్టు సంఘ కార్యదర్శొ ఎస్‌.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.

జిల్లా నెట్‌బాల్‌ సీనియర్‌ జట్ల ఎంపిక
ఎంపికైన జట్లతో చీఫ్‌ కోచ్‌ వెంకటేశ్వరరావు

గుంటూరు(క్రీడలు), డిసెంబరు5: జిల్లా నెట్‌బాల్‌ సంఘ ఆధ్వర్యంలో గుంటూరు బీఆర్‌ స్టేడియంలో ఆదివారం మహిళలు, పురుషులు విభాగంలో జిల్లా నెట్‌బాల్‌ జట్ల ఎంపిక చేసినట్టు సంఘ కార్యదర్శొ ఎస్‌.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన జట్లు ఈనెల 17 నుంచి 19 వరకు వైజాగ్‌లో జరిగే రాష్ట్ర అంతర్‌ జిల్లాల నెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.  ఎంపికల పర్యవేక్షకులుగా జిల్లా చీఫ్‌ కోచ్‌ జి.వెంకటేశ్వరరావు, బాస్కెట్‌బాల్‌ సంఘ కార్యదర్శి ఆంజనేయులు, కోచ్‌ చావలి శ్రీనివాసరావు వ్యవహరించారు.

 క్రీడా దుస్తుల పంపిణీ

 జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ సంఘ ఆధ్వర్యంలో స్ధానిక ఎన్జీవో హోమ్‌లో ఆదివారం జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు చీఫ్‌కోచ్‌ వెంకటేశ్వరరావు, సంఘ సభ్యులు శివశంకర్‌, ప్రభాకర్‌, అప్పారావు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.


Updated Date - 2021-12-06T05:44:41+05:30 IST