నేతమ్స్‌ షుగర్స్‌ ఆస్తుల వేలం

ABN , First Publish Date - 2021-03-04T06:24:34+05:30 IST

నిండ్రలోని నేతమ్స్‌ షుగర్స్‌ ఆస్తుల వేలం బుధవారం కర్మాగార ఆవరణలో జరిగింది.

నేతమ్స్‌ షుగర్స్‌ ఆస్తుల వేలం
వేలం పాటలు నిర్వహిస్తున్న అధికారులు

నిండ్ర, మార్చి 3: మండలకేంద్రంలో ఉన్న నేతమ్స్‌ షుగర్స్‌ ఆస్తుల వేలం బుధవారం కర్మాగార ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్‌ జాన్‌విక్టర్‌ మాట్లాడుతూ... 2019-20 చెరకు క్రషింగ్‌ సీజన్‌కు సంబంధించి నేతమ్స్‌ యాజమాన్యం రైతుల కు బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించగా, ఫ్యాక్టరీని విక్రయించి బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఆ మేరకు అధికారులు నోటీసులు అందజేయగా ఫ్యాక్టరీ యాజమాన్యం స్టే తెచ్చుకుందని గుర్తుచేశారు. దీనిపై చెరకు రైతులు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే రద్దు చేసి, నేతమ్స్‌ ఆస్తుల విక్రయానికి అనుమతిని ఇచ్చిందని చెప్పారు. జిల్లా అధికారులు మార్చి 3న వేలం వేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 17న నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఆ మేరకు బుధవారం కర్మాగార ఆవరణలో వేలం ప్రక్రియ నిర్వహించామని పేర్కొన్నారు. వేలం నిర్వహణపై అధికారు లతో చెరకు రైతులు వాగ్వాదానికి దిగారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు వేలం ప్రక్రియ కొనసాగించారు. వేలంలో నలుగురు పాట దారులు పాల్గొనగా, చెన్నైకి చెందిన ఆర్పీ ట్రేడర్స్‌ యాజమాన్యం రూ.11.25 కోట్లకు నేతమ్స్‌ షుగర్స్‌ ఆస్తులను దక్కించుకుంది. ఈ వివ రాలను కలెక్టర్‌కు వివరిస్తామనీ, ఆయన ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు కేన్‌ కమిషనర్‌ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రసన్నకుమార్‌, సీఐ రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T06:24:34+05:30 IST