Abn logo
Jun 22 2021 @ 02:02AM

దళిత సాహిత్యంలో సూర్యుడు నేతల

తణుకు, జూన్‌ 21 : అన్నంగిన్నె, భీమ్‌ పాల్‌రాగం, సమతా వసంత గానం వంటి రచనల ద్వారా దళిత సాహిత్యంలో అంబే డ్కరిజాన్ని ప్రతిష్టించిన కవి నేతల ప్రతాప్‌ కుమార్‌ అని వక్తలు కొనియడారు. దళిత రచయితల వేదిక కవిసంధ్య ఆధ్వర్యంలో తణుకుకు చెందిన ప్రతాప్‌ కుమార్‌ సంస్మ రణ సభ జూమ్‌ వేదికగా జరిగింది. అధ్య క్షత వహించిన కవి సంధ్య సంపాదకులు డాక్టర్‌ శిఖామణి మాట్లాడుతూ దళిత కవిత్వంలో అంబేడ్కర్‌ వాద కవిత్వానికి నేతల ఆద్యుడని పేర్కొన్నారు. ప్రముఖ కవి, వక్త డాక్టర్‌ కత్తి పద్మారావు మాట్లాడుతూ దళిత మహాసభ ద్వారా నేతల కార్య కర్తగా, కవిగా ఎదిగారని, దళిత సాహిత్య ఆకాశంలో నేతల సూర్యుడు వంటి వాడన్నారు. డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ కూల్చి చేయబడుతున్న అంబే డ్కర్‌, బౌద్ద సేదాల్ని నేతల పునర్ని ర్మాణం చేశారన్నారు. కరోనా వ్యాధిని దళిత దృక్ప థం నుంచి వ్యాఖ్యానించాడన్నారు. ఎన్‌జే విద్యాసాగర్‌, డాక్టర్‌ చల్లపల్లి స్వరూపరాణి, పల్నాటి శ్రీరాములు, కొప్పర్తి, నేతల ప్రతాప్‌కుమార్‌ కుమార్తె సాహితి, కుమారుడుతోపాటు కోనాల భీమారావు, సీహెచ్‌ రాం, గౌతమ్‌, ఇన్‌కోటి రాంబాబు, సోమశేఖర్‌, తదితరులు నేతలతో వున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. 


ప్రసంగిస్తున్న శిఖామణి