నేతాజీకి నివాళి

ABN , First Publish Date - 2021-01-24T05:39:03+05:30 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.

నేతాజీకి నివాళి
మార్కాపురంలో బోసు విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు



మార్కాపురం (వన్‌టౌన్‌) జనవరి 23 : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ బ్రిటీష్‌ వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శాసనాల సరోజిని, మద్దెల లక్ష్మీ, శ్రీధర్‌, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 

స్థానిక హంసా ఫౌండేషన్‌ కార్యాలయంలో నేతాజీ సుభాష్‌ చంద్రబో్‌సకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ జిల్లా కన్వీనర్‌ పి.వి.కృష్ణారావు, డి.రాజు, కేశవ, డా.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

దర్శిలో..

దర్శి : మండలంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సుబాష్‌ చంద్రబోస్‌ జ యంతిని మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పోతవరం పాఠశాలలో ఈ సందర్భంగా సుబా్‌సచంద్రబోస్‌ చిత్రపటానికి ఎంఈవో కె.రఘురామయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు సుబా్‌సచంద్రబోస్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జె.శ్రీనివాసరావు ఉపాధ్యాయులు ఖాశీం, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పామూరులో..

పామూరు :  నేతాజీ దేశభక్తి  విద్యార్థులకు ఆదర్శం కావాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్‌ వెంకటేశ్వర నాయక్‌ అన్నారు. స్థానిక ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో ఏపీ  కన్జూమర్‌ రైట్స్‌ ప్రొడెక్టివ్‌ సంస్థ ఆధ్వర్యంలో బోసు జ యంతిని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో అబ్దుల్‌ రషీ ద్‌ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక దివ్యజ్ఞాన సమాజంలో నేతాజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయ కులు రమణయ్య, ప్రభాకర్‌, సురేష్‌, శ్రీనివా సులు, నారాయణ పాల్గొన్నారు. 

సీఎస్‌పురంలో.. 

సీఎస్‌పురం : నేతాజీ జయంతిని స్థానిక బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ నాయకులు శనివారం నిర్వహించారు. బోసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు  లక్ష్మయ్య, వెంకటనారాయణ, లక్ష్మీనారా యణ, సత్యం, ఆశిష్‌  పాల్గొన్నారు.


Updated Date - 2021-01-24T05:39:03+05:30 IST