హిందూవాహిని ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-01-24T01:47:06+05:30 IST

హైదరాబాద్: హిందూవాహిని ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ఇన్‌క్రిడిబుల్ వన్ హోటల్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

హిందూవాహిని ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్: హిందూవాహిని ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ఇన్‌క్రిడిబుల్ వన్ హోటల్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీ నారాయణ ఆన్ లైన్ ద్వారా కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని నేటి యువతీ యువకులు రానున్న భారత శతాబ్దానికి ఆర్థిక, సామాజిక పునాదులు బలంగా వేయాలని, శాస్త్ర సాంకేతిక, విద్యా, వైద్య రంగాలలో ప్రతిభ పాటవాలు ప్రదర్శించి, దేశ అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.


ప్రధానవక్తగా హాజరైన సమరసతా వేదిక తెలంగాణ అధ్యక్షులు అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ త్యాగాలను కొనియాడారు. బ్రిటీష్ వారి దాస్య శృంఖలాల నుంచి భారతమాతను విముక్తం చేసేందుకు బోస్ అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. భారతీయులనే కాక ఆగ్నేయాసియా దేశాల వారి సహకారాన్ని కూడా పొంది బోస్ ప్రపంచ విజేతగా నిలిచారని అప్పాల ప్రసాద్ కీర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేస్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విగ్రహం ఏర్పాటు ద్వారా నేతాజీకి నిజమైన నివాళి ఇచ్చినట్లైందని అప్పాల ప్రసాద్ చెప్పారు.


కార్యక్రమంలో అఖిల భారత హిందూ వాహిని నాయకులు త్రివిక్రమ్, రాష్ట్ర అధ్యక్షులు హరీష్‌ చంద్ర,, ప్రధాన కార్యదర్శి ఉప్పల రాజన్న తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-24T01:47:06+05:30 IST