అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): దేశ స్వాతంత్య్ర సముపార్జనలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన సేవలు అజరామరమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా శనివారం రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అలాగే, టీడీపీ జాతీయ కార్యాలయంలో నేతాజీ 125వ జయంతిని నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు.