Abn logo
Oct 28 2021 @ 00:26AM

ఎర్రచెరువు కట్టకు నెర్రెలు

మరమ్మతులు చేపట్టిన అధికారులు

తలుపుల, అక్టోబరు 27: ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని మాడికవాండ్లపల్లి సమీపంలో ఉన్న ఎర్రచెరువు కట్ట తెగిపోయింది. దీంతో అధికా రులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులు చేపట్టిన ప్రాం తంలో కట్టకు నెర్రెలు చీలడంతో స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని  ఇరిగేష న్‌ అధికారులకు, పోలీసులకు చేరవేశారు. వారు వెంటనే చెరువుకట్టను పరిశీలిం చారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కట్టకు ఎలాంటి ప్రమాదం జరుగకుం డా చెరువుకు ఇరువైపులా ఉన్న మరువల ద్వారా నీటిని కిందికి వదిలా రు. దీని వలన చెరువుకట్టకు నీటి తీవ్రత తగ్గి ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ జేఈ అరుణకుమారి, ఎస్‌ఐ శరత్‌చంద్ర, ఎం పీపీ మహ మ్మద్‌రఫీనాయక్‌, మాజీ సర్పంచు ఫయాజ్‌ అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.